News August 8, 2025
EP30: ఇలా చేస్తే శత్రువులు కూడా ప్రశంసిస్తారు: చాణక్య నీతి

తెలివి, జ్ఞానం ఉన్న వారికి అన్ని చోట్ల గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. ‘జీవితంలో ప్రతి దశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. నిజాయితీగా, సంస్కారవంతంగా ఉంటే ఎవరూ మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. చేసే ప్రతీ పనిని ప్రేమించాలి. గొప్ప నైపుణ్యాలు ప్రదర్శిస్తే సంబంధిత రంగాల్లో గౌరవం, డబ్బు లభిస్తాయి. నైపుణ్యాలు చూసి శత్రువులూ ప్రశంసిస్తారు’ అని బోధిస్తోంది.
Similar News
News August 8, 2025
నేడు వరలక్ష్మీ వ్రతం.. వాయనం ఇస్తున్నారా?

వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక నిండుమనసుతో ముత్తైదువులకు వాయనం ఇస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వాయనంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, గాజులు, జాకెట్ ముక్క, వక్కలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన వస్తువులు ఉండకూడదు. ముత్తైదువును మహాలక్ష్మిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి.
News August 8, 2025
సంక్రాంతి బరిలో నిలిచేది ఎవరు?

వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీని పొంగల్‌కు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రవితేజ-కిశోర్ తిరుమల సినిమా, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కూడా అప్పుడే విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అటు ప్రభాస్ ‘రాజాసాబ్’, బాలకృష్ణ ‘అఖండ-2’ కూడా సంక్రాంతికే రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
News August 8, 2025
ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘నిషేధంపై ఆలయాల్లో బోర్డులు పెట్టాలి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే కవర్ల స్థానంలో కాటన్/జూట్/పేపర్ బ్యాగులు వాడేలా చూడాలి. అరిటాకులు/స్టీల్ ప్లేట్లలో అన్నప్రసాదం వడ్డించాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుమతించొద్దు. స్టీల్ మగ్గులు, గ్లాసులు అందుబాటులో ఉంచాలి’ అని అధికారులను ఆదేశించింది.