News April 25, 2024
ఎల్లలు లేని మానవత్వం.. పాక్ యువతికి భారతీయుడి గుండె

మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపితమైంది. గుండె వ్యాధితో బాధపడుతోన్న పాకిస్థాన్‌కు చెందిన ఆయేషా రశన్(19) అనే యువతికి చెన్నైలోని ఆస్పత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ చికిత్స అందించింది. ఇటీవల చనిపోయిన ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చింది. రూ.35 లక్షలకు పైగా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఫ్రీగా చేసింది. తమ కూతురికి జీవితాన్నిచ్చిన ట్రస్టు, వైద్యులకు ఆమె తల్లి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News April 19, 2026
MGU: పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2, 4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.
News April 19, 2026
హైకోర్టులో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్

AP హైకోర్టులో 300 ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసర్ సబార్డినేట్, టైపిస్ట్ తదితర ఉద్యోగాలున్నాయి. పోస్టుల ఆధారంగా 7వ తరగతి/డిగ్రీ/బీటెక్, షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి. CBT, స్కిల్ ఆధారంగా ఎంపిక ఉండనుంది. పోస్టులను బట్టి నెల వేతనం రూ.20వేల-రూ.లక్షన్నర వరకు ఉంది. నోటిఫికేషన్, అప్లై చేయడానికి ఇక్కడ <