News April 25, 2024

పట్టుమని 10 కంపెనీలు కూడా రాలేదు: షర్మిల

image

AP: వైసీపీ పాలనలో రాష్ట్రానికి పట్టుమని 10 కంపెనీలు కూడా రాలేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సాగర్ కాలువలు ఆధునీకరించలేదు. మూడు రాజధానులు అని ఒక్కటీ నిర్మించలేదు. మంత్రి అంబటి కాలువల్లో మట్టి కూడా తీయించలేకపోయారు. ఆయన ఒక విఫల మంత్రి’ అని ఆమె ఫైర్ అయ్యారు.

Similar News

News April 14, 2026

3,058 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్

image

రైల్వేలో 3,058 NTPC(UG) ఉద్యోగాలకు పరీక్షల తేదీలను RRB విడుదల చేసింది. మే 7, 8, 9, జూన్ 13, 14, 16-21 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు 10 రోజుల ముందు అభ్యర్థులకు కేటాయించిన సిటీ పేరు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. రోజూ 3 షిఫ్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.

News April 14, 2026

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్.. లక్షణాలు ఇవే

image

కొందరు మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు తయారవుతుంటాయి. దీని వల్ల నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్‌ పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడిపడి తరచూ మూత్రవిసర్జన, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరగడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

News April 14, 2026

శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

image

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ధి, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.