News April 26, 2024

TTD వద్దనున్న రూ.2వేల నోట్లు మార్పిడి

image

AP: గత ఏడాది OCT 7 నుంచి రూ.2వేల నోట్ల మార్పిడిని RBI నిలిపివేయగా, ఆ తర్వాత కూడా కొందరు భక్తులు ఆ నోట్లను శ్రీవారి హుండీలో సమర్పించారు. ఆ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులు కోరగా, RBI సానుకూలంగా స్పందించింది. ఈ ఏడాది మార్చి 22 వరకు ఐదు విడతల్లో రూ.3.20 కోట్లను మార్చినట్లు TTD వర్గాలు వెల్లడించాయి.

Similar News

News April 12, 2026

విజయ్ బ్రేకులు.. వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ DMK సెటైర్లు

image

తమిళనాడు ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఈ తరుణంలో TVK చీఫ్ విజయ్ తన ప్రచార సభలను వరుసగా రద్దు చేసుకోవడంపై DMK విమర్శలు గుప్పించింది. నేతలంతా ప్రజల్లో తిరుగుతుంటే ఆయన మాత్రం బ్రేకులు తీసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. విజయ్ ఇంకా చాలా జిల్లాలు కవర్ చేయాల్సి ఉండటంతో నేరుగా జనం మధ్యకు వెళ్తేనే ఓట్లు వస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.

News April 12, 2026

హార్ముజ్‌లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

image

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్‌కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

News April 12, 2026

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

image

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.