News October 5, 2024
EXIT POLLS: జమ్మూకశ్మీర్‌లో అధికారం ఎవరిదంటే?

J&K ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారం చేపట్టే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. NC 33-35, కాంగ్రెస్ 13-15 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. బీజేపీ 23-27 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. అయితే మేజిక్ ఫిగర్ 46ను అందుకోలేక INC+NC 35-40 స్థానాలే గెలుస్తాయని దైనిక్ భాస్కర్, 43 సీట్లకే పరిమితమై హంగ్ ఏర్పడొచ్చని NDTV సర్వే వెల్లడించింది.
Similar News
News December 7, 2025
నగరంలో NAVY బ్యాండ్ షో.. ఫ్రీ ఎంట్రీ

ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్‌లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్, డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొండాపూర్‌లోని సరత్ సిటీ మాల్‌లో ఒక గంట పాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయ స్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ ఉచిత కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.
News December 7, 2025
నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతోందా?

కొంతమందికి నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. అయితే ఇది సాధారణం కాదంటున్నారు వైద్యులు. నిద్రలో నోటి నుంచి లాలాజలం కారడం కొన్ని వ్యాధులకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. సైనస్ ఇన్‌ఫెక్షన్, నిద్ర, నాడీ, గ్యాస్ట్రో సంబంధిత, దంతాలు లేదా చిగుళ్లలో సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 6, 2025
నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.


