News April 27, 2024

కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు

image

AP: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మార్చితోనే వారి గడువు ముగియగా, ఆయా విభాగాధిపతుల విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది.

Similar News

News April 20, 2026

హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

image

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.

News April 20, 2026

వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్‌కు ఏర్పాట్లు

image

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.

News April 20, 2026

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

image

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.