News July 31, 2024
పీవీ సింధు కోసం ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశా: మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు కోసం గతంలో తానో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నానని తెలిపారు. ‘నా సమకాలికుల్లో పీవీ సింధు, నీరజ్ చోప్రా దిగ్గజాలు. సింధుపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ నాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి సింధుకు మద్దతుగా నిలిచాను’ అని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


