News April 10, 2024
FakeNews: వార్తల వెరిఫికేషన్ చాలా సులువు

Way2News లోగోతో కొందరు తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారు. వీటిని నమ్మినా, షేర్ చేసినా మనం ఇబ్బందులు పడవచ్చు. మేము పబ్లిష్ చేసే ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఫార్వర్డ్ ఆర్టికల్ కన్పించాలి. లేదంటే మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ మాది కాదు అని గ్రహించండి. మీరు Way2News లోగోతో ఫేక్ వార్తలు పొందితే ఈ-మెయిల్‌లో రిపోర్ట్ చేయండి. grievance@way2news.com -ధన్యవాదాలు
Similar News
News December 17, 2025
టాటా కొత్త కారు.. ఫస్ట్ రోజే 70వేల బుకింగ్స్

టాటా మోటార్స్ నూతనంగా తీసుకొచ్చిన ‘<<18386296>>సియారా<<>>’ మోడల్ కారు రికార్డులు బ్రేక్ చేస్తోంది. బుకింగ్ ప్రారంభమైన తొలిరోజే (డిసెంబర్ 16) 70వేల బుకింగ్స్ అయ్యాయని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ SUV ధర రూ.11.49 లక్షల-రూ.21.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రెడ్, ఎల్లో, సిల్వర్, గ్రీన్, మింటల్ గ్రే, వైట్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి.
News December 17, 2025
ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు: CM

AP: గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని CM CBN కలెక్టర్లను ఆదేశించారు. ‘ఇటీవల 3 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. ఉగాది నాటికి మరో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాం. ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయాలి. గతంలో ఊళ్లకు దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు. వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలి’ అని సూచించారు.
News December 17, 2025
ఐటీఐ అర్హతతో 156 పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


