News March 27, 2024
‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ టైమ్ ఫిక్స్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ట్రైలర్ రేపు విడుదల కానుంది. హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలో కూడా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News February 13, 2026
గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని BRS నేత కేటీఆర్ ఆరోపించారు. గద్వాలలోని ఓ వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించి కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఓటుతో గెలిపించుకున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట, చౌటుప్పల్‌లోనూ ఇలాగే చేశారని చెప్పారు. 16 మున్సిపాలిటీల్లో నేరుగా గెలుస్తున్నామని, మరో 10-15 చోట్ల BRS లార్జెస్ట్ పార్టీ అని తెలిపారు.
News February 13, 2026
నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.



