News March 31, 2024
ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలే: చంద్రబాబు

AP: ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ పెత్తందారులు, భూస్వాముల పార్టీ. ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. జగన్ శవ రాజకీయాలు నమ్మొద్దు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. మాది పేదల పక్షం.. ప్రజలతోనే ఉంటాం. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 10, 2026
కరీంనగర్ జిల్లాలో 189 మంది బైండోవర్: సీపీ గౌష్ ఆలం

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 189 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు, 49 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
News February 10, 2026
రేపు ఉద్యోగులకు సెలవు

TG: రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్లలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు చేసింది. సెలవు లేదనే కారణంగా ఓటుకు దూరం కావొద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే <<19099000>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.
News February 10, 2026
అల్లు అర్జున్ 42 రూల్స్ అంటూ ప్రచారం.. AA టీమ్ సీరియస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ <<19101939>>కావేరీ బారువా<<>> చేసిన వ్యాఖ్యలపై AA టీమ్ స్పందించింది. ‘ఇటీవల అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ఈ ఆరోపణలను మేము సీరియస్‌గా తీసుకున్నాం. బాధ్యులపై పరువునష్టం దావా వేసేందుకు మా లీగల్ టీమ్ సిద్ధమవుతోంది. ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని ప్రకటన విడుదల చేసింది.


