News April 12, 2024

రైతన్నల పొట్టకొడుతున్నారు!

image

TG: రైతులను ఇబ్బంది పెట్టవద్దని CM రేవంత్ చెప్పినా పలుచోట్ల పరిస్థితి మారడం లేదు. మార్కెట్లకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. ట్రేడర్లు, మిల్లర్లు దందా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత పేరుతో క్వింటాకు రూ.500-రూ.600 అడ్డగోలుగా కోత విధిస్తున్నారట. మార్కెట్లలో మిల్లర్లు, ట్రేడర్లు, సిబ్బంది కుమ్మక్కై తమను దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 13, 2025

లోక్ అదాలత్‌లో 19,577 కేసులు పరిష్కారం

image

జాతీయ లోక్‌అదాలత్‌లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్తి తెలిపారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీల ద్వారా 284 సివిల్, 19,096 క్రిమినల్, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు రూ. 6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 13, 2025

రేపే రెండో విడత.. ఉ.7 గంటలకు పోలింగ్ స్టార్ట్

image

TG: రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.

News December 13, 2025

ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

image

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.