News November 23, 2024
వేగంగా, నెమ్మదిగా.. ఎలా అయినా ఓకే అంటోన్న జైస్వాల్
టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొడుతున్నారు. అవసరమైనప్పుడు వేగం కంటే నిలకడగా ఆడటం ముఖ్యమని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్‌పై 123 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టులో కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన ఆయన ఇలా లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలనని నిరూపిస్తున్నారు. యశస్వీ సెంచరీ దిశగా సాగుతున్నారు.
Similar News
News December 6, 2024
రికార్డు సృష్టించిన బుమ్రా
టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించారు. అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఖవాజాను ఔట్ చేయడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. దీంతో భారత టెస్టు చరిత్రలో ఒకే ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆయన నిలిచారు. గతంలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు.
News December 6, 2024
పుష్ప-2 తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
పుష్ప-2 సినిమాకు తొలిరోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. ALL TIME RECORD అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.72కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది.
News December 6, 2024
MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం
వ్యవసాయ ఉత్పత్తులను MSPతో కొనేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్పత్తుల ఖర్చులో 50% రైతులకు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ అవసరం లేకుండా రైతుల ఆదాయం పెంపు, నష్టాల సమయంలో పరిహారం వంటి చర్యలతో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.