News August 20, 2025
‘ఫౌజీ’ ఫొటో లీక్.. మేకర్స్ ఫైర్

డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేయడంపై మేకర్స్ ఫైర్ అయ్యారు. ‘సెట్స్‌లోని ఫొటోను షేర్ చేస్తున్నట్లు గుర్తించాం. మీకు ఉత్తమ అనుభవాన్ని అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. కానీ ఇలాంటి లీకులు వాటిని దెబ్బతీస్తాయి. షేర్ చేసిన వారి అకౌంట్స్‌ను బ్లాక్ చేయించి, సైబర్ క్రైమ్ కేసులు పెడతాం’ అని హెచ్చరించారు.
Similar News
News January 23, 2026
టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.
News January 23, 2026
WPL: యూపీపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.


