News May 7, 2025
న్యాయమూర్తిని అరెస్టు చేసిన FBI!

అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఏకంగా ఓ న్యాయమూర్తినే తాజాగా అరెస్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారుడికి మిల్‌వాకీలోని సీనియర్ సిటింగ్ జడ్జి హన్నా దుగన్ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా కోర్టులోనే అధికారుల్ని ఆమె తప్పుదోవ పట్టించి వలసదారుడు తప్పించుకునేందుకు సహకరించడంతో FBI ఆమెను, వలసదారుడిని అరెస్ట్ చేసింది.
Similar News
News February 17, 2026
ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ దూరం

ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్‌గేట్స్ దూరంగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎప్‌స్టీన్ బాధితులకు అండగా ఉండటమే ముఖ్యమని వెల్లడించాయి. అమ్మాయిలతో బిల్‌గేట్స్ దిగిన ఫొటోలు ఇటీవల ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భారత పర్యటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాంటి వ్యక్తిని ఆహ్వానించడం ఏంటని ప్రశ్నలొచ్చాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
News February 17, 2026
బీర పంటలో మంచి దిగుబడి, ధర రావాలంటే..

బీర విత్తనాలను నాటిన తర్వాత మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. దీని వల్ల ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి పెరుగుతుంది. అలాగే విత్తనం రకాన్ని బట్టి బీర పంట 60 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. ముదిరితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి.
News February 17, 2026
వీడ్కోలులోనూ అక్కసు వెళ్లగక్కడం మానలేదు

బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు యూనస్ చేసిన వీడ్కోలు ప్రసంగం వివాదాస్పదమైంది. భారత్ పేరు ప్రస్తావించకుండా ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ ట్రేడ్ పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఇకపై బంగ్లాదేశ్ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. యూనస్ హయాంలో బంగ్లాలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకం కాగా తన ప్రసంగంలో దేశప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించామని ఆయన చెప్పుకోవడం విడ్డూరం.


