News March 31, 2024
బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది: షర్మిల

AP: దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు.. ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ ప్రభుత్వ కుట్ర. ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. అదానీ, అంబానీల అనుచరులకు జగన్ పదవులు కట్టబెడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 7, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<
News February 7, 2026
రేపు పఠించాల్సిన సూర్య మంత్రాలు

సూర్యారాధనలో మంత్ర పఠనం అత్యంత శక్తిమంతంగా పని చేస్తుందని నమ్మకం. ‘ఓం సూర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య మంత్రం బుద్ధిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుంది. ‘ఓం సూర్యాయ నమః’ అనే సూర్య అష్టాక్షరి మంత్రం కూడా చాలా ప్రభావవంతమైనది. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాలను పఠిస్తూ అర్ఘ్యం వదిలితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి ఉత్తేజితమవుతుంది.
News February 7, 2026
పవన్ సినిమాలో ఫౌజీ హీరోయిన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఉగాదికి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఫౌజీ’ భామ ఇమాన్వి నటిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది.


