News February 20, 2025
ఫిబ్రవరి 20: చరిత్రలో ఈరోజు

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
Similar News
News March 28, 2025
BREAKING: లక్నో చేతిలో SRH ఓటమి

IPL-2025: ఈ సీజన్లో SRHకు తొలి ఓటమి ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో SRHపై లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 16.1 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. పూరన్ 26 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 రన్స్ చేసి మ్యాచును తమవైపు లాగేశారు. ఓపెనర్ మార్ష్ (52) హాఫ్ సెంచరీతో రాణించారు. కమిన్స్ రెండు వికెట్లు తీశారు.
News March 28, 2025
టెన్త్ అర్హతతో 1,161 ఉద్యోగాలు.. మరో వారమే?

సీఐఎస్ఎఫ్ 1,161 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్రిక్యులేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. https://cisfrectt.cisf.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు.
News March 28, 2025
ట్రంప్ కొరడా.. ఆరోగ్య శాఖలో 10వేల మందికి చెక్

ప్రభుత్వ శాఖల్లో ఖర్చును తగ్గించాలని నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆరోగ్య శాఖపై కొరడా ఝుళిపించారు. ఆ శాఖలోని 10వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చర్యలు చేపట్టారు. ఎక్కువగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3,500మందిని తొలగించనున్నారు. ఈ నిర్ణయంతో ఏడాదికి 1.8బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.