News April 10, 2024
ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ – 3/3

కేరళ స్టోరీకి కౌంటర్‌గా మణిపుర్ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ప్రధాన కారణం కుకీ తెగ అంటున్నారు విశ్లేషకులు. ఈ తెగలో అధికశాతం మంది క్రైస్తవులే. మైతీ-కుకీల మధ్య జరిగిన హింసపై రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఓట్లను ప్రభావితం చేయొచ్చంటున్నారు. పొలిటికల్ అజెండా లేదంటూనే ఇరు పక్షాలూ సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ స్టోరీ ప్రదర్శనలపై UDF, LDF కూటమి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోందట. <<-se>>#Elections2024<<>>
Similar News
News December 6, 2025
చాలా సమస్యలు పాక్ నుంచే వస్తాయి: జైశంకర్

పాక్ <<18473435>>CDFగా<<>> ఆసిమ్ మునీర్ నియామకంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. పాక్ ఆర్మీ ఇప్పటికీ అలానే ఉందని, తమకు చాలా సమస్యలు అక్కడి నుంచే వస్తాయని చెప్పారు. ‘మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు ఉన్నట్లే.. మంచి మిలిటరీ లీడర్లు, అంత మంచివాళ్లు కాని లీడర్లు ఉన్నారు. పాక్‌ను పెద్దగా పట్టించుకోకూడదు. కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే. వాటిని పరిష్కరిస్తాం’ అని HT లీడర్‌షిప్ సమ్మిట్‌లో చెప్పారు.
News December 6, 2025
11 నుంచి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర

AP: ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా అటల్-మోదీ సుపరిపాలన యాత్ర చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ఆవిష్కరించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ శతజయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నామన్నారు. దేశ హితం కోసమే ఆయన నిత్యం తపించేవారని, గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారని గుర్తుచేసుకున్నారు.
News December 6, 2025
INDvsSA.. ఇద్దరు ప్లేయర్లు దూరం!

భారత్‌తో మూడో వన్డేకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. జోర్జి T20 సిరీస్‌కూ దూరమైనట్లు SA బోర్డు వెల్లడించింది. టీ20లకు ఎంపికైన పేసర్ మఫాకా ఇంకా కోలుకోలేదని, అతడి స్థానంలో సిపమ్లాను ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా తొలి వన్డేలో 39 రన్స్ చేసిన జోర్జి, రెండో వన్డేలో 17పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. బర్గర్ 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీశారు.


