News April 24, 2025
పాక్ హీరోతో సినిమా.. భారత హీరోయిన్‌పై ఫైర్

పాక్ హీరో ఫవాద్ ఖాన్ మూవీని ప్రమోట్ చేశారంటూ విమర్శల నేపథ్యంలో బాలీవుడ్ నటి వాణీ కపూర్ ‘X’లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను డిలీట్ చేశారు. ఫవాద్, వాణీ ‘అబీర్ గులాల్’లో జంటగా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ పోస్టర్‌ను నిన్న ‘X’లో షేర్ చేశారు. అయితే పహల్‌గామ్ ఉగ్రదాడి సందర్భంగా పాక్ నటుడి చిత్రాన్ని ప్రమోట్ చేస్తారా? అంటూ నెటిజన్స్ నటిపై ఫైర్ అయ్యారు. దీంతో ఆ పోస్టర్‌ను ఆమె తొలగించారు.
Similar News
News March 12, 2026
త్వరలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి?

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవతో ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్ ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఇటీవల విజయ్-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహాలు జరగగా, త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యా రెడ్డి ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే.
News March 12, 2026
16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
News March 12, 2026
వరి పంట విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

వరి పంట ప్రస్తుతం నాటిన సమయాన్ని బట్టి ఈనిక, గింజ పాలుపోసుకునే దశ, పూత దశలో ఉంది. ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ పంట పూత దశలో ఉన్నట్లైతే నీటి ఎద్దడికి గురికాకుండా 2 అంగుళాల మేర నీరు ఉండేలా చూడాలి. పంట పిలక దశలో ఉంటే రెండో దఫాగా 45 kgల యూరియా వేయాలి. చిరుపొట్ట దశలో ఉన్న పొలాల్లో చివరి దఫా యూరియా 45KGలు+ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20kgలు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


