News May 14, 2024
FINAL: మెదక్ ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ 75.09%

మెదక్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. దుబ్బాక-82.42%, గజ్వేల్-80.31%, మెదక్-80.19%, నర్సాపూర్-84.25%, పటాన్‌చెరు-63.01%, సంగారెడ్డి-71.99%, సిద్దిపేట-73.64%గా నమోదైంది. కాగా ఇక్కడ మొత్తం 75.09% నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రాంరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు.
Similar News
News December 8, 2025
MDK: నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య ఏకగ్రీవ సర్పంచ్

టేక్మాల్ మండలం చల్లపల్లిలో ఎల్లంపల్లి సంగీతను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి గోపాల్ 2018 సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి 11 ఓట్లతో గెలిచాడు. 5 ఏళ్లు గోపాల్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన గ్రామ ప్రజలు అతని భార్య ఎల్లంపల్లి సంగీతను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో నామినేషన్ వేయించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 8, 2025
MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్‌లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!