News April 13, 2024
సీఎం పదవిపై హైకమాండ్‌దే తుది నిర్ణయం: సిద్ధరామయ్య

కర్ణాటక CM సిద్ధరామయ్య రెండున్నరేళ్ల తర్వాత తన పదవిని వదులుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను CMగా కొనసాగాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తే ఆ పదవిలోనే కొనసాగుతా. లేదంటే అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా. 4ఏళ్ల తర్వాత ప్రత్యక రాజకీయాల్లో ఉండను’ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో NDAకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు రావని అన్నారు.
Similar News
News December 14, 2025
వారంలో రూ.14,100 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల హవా కొనసాగుతోంది. ఈ వారంలో(DEC 7-13) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,760 పెరిగి రూ.1,33,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,450 పెరగడంతో రూ.1,22,750గా ఉంది. ఇక కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.14,100 పెరిగి రూ.2,10,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
News December 14, 2025
పసుపులో దుంపకుళ్లు తెగులు – నివారణ

నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు పంటకు దుంపకుళ్లు ముప్పు ఎక్కువ. దీని వల్ల కాండంపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దుంప చూస్తే వేర్లు కుళ్లి నల్లగా మారి, లోపల చిన్న పురుగులు ఉండి, దుర్వాసన వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100kgల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల కట్టడికి 3g కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10kgలు వేయాలి. కుళ్లినచోట లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణం పోయాలి.
News December 14, 2025
మలయాళ నటుడు ఆత్మహత్య!

మలయాళ నటుడు అఖిల్ విశ్వనాథ్(30) మృతి చెందారు. తల్లి చూసేసరికి అఖిల్ ఇంట్లో శవమై కనిపించారు. అతను ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలున్నాయి. అఖిల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘చోలా’ చిత్రానికి 2019లో కేరళ స్టేట్ అవార్డ్ లభించింది. అతను మొబైల్ షాపులో మెకానిక్‌గా చేస్తున్నారని, కొన్నాళ్లుగా ఆ పనికీ వెళ్లట్లేదని తెలుస్తోంది. బైక్ ప్రమాదంలో గాయపడిన అఖిల్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


