News April 27, 2024
నెలాఖరు దాకా మంటలే..

AP: రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత రోజురోజుకు తీవ్రమవుతోంది. సగానికి పైగా జిల్లాల్లో వడగాల్పులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు చోట్ల 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ పరిస్థితి నెలాఖరు వరకు కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 183 మండలాల్లో వడగాల్పులు వీయనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News April 14, 2026
ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.
News April 14, 2026
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
News April 14, 2026
అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

హిట్టర్ అభిషేక్ శర్మకు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.


