News April 26, 2024
సొంతగడ్డపై SRHకు తొలి ఓటమి

భారీ స్కోర్లతో ప్రత్యర్థులను భయపెడుతున్న SRHకు నిన్న ఆర్సీబీ చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ సీజన్లో సొంతగడ్డపై SRH ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ నిన్న ఆర్సీబీ ఆ రికార్డుకు బ్రేకులు వేసింది. దీంతో అన్ని జట్లు తమ సొంతగడ్డపై పరాజయం చవిచూసినట్లు అయింది. కాగా, నిన్న ఆర్సీబీ 206 రన్స్ చేయగా SRH 171 పరుగులకే పరిమితమైంది.
Similar News
News April 13, 2026
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.
News April 13, 2026
బ్రహ్మ చేసిన పొరపాటు ఏంటి?

ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ అందులోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి అతడిని పిసినారిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం.<<-se>>#PADHYAM<<>>
News April 13, 2026
త్వరలో హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు!

TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేసే మెషీన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 2 ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన యంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. BP, ECG, BMI, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షనింగ్, థైరాయిడ్ తదితర టెస్టులు వీటితో చేసుకోవచ్చు.


