News April 12, 2025

15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం

image

AP: ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీవో నం.129 విడుదల చేశారు.

Similar News

News January 15, 2026

అచ్చంపేట కుటుంబం ఆదర్శం

image

ఉద్యోగ రీత్యా దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా సంక్రాంతికి మాత్రం స్వగ్రామం చేరడం ఆ కుటుంబానికి 12 ఏళ్లుగా ఆనవాయితీ. అచ్చంపేటకు చెందిన సదరు కుటుంబ సభ్యులు బుధవారం ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా వేడుకలు చేసుకున్నారు. చిన్నలు, పెద్దలు అంతా కలిసి వేడుకల్లో పాల్గొంటూ అనురాగాలను పంచుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో పండుగ వేళ ఇలా అందరూ కలవడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.

News January 15, 2026

సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

image

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.