News March 13, 2025
ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

AP: రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Similar News
News February 7, 2026
బీట్‌రూట్‌తో బ్యూటీ

బీట్‌రూట్‌ను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్‌రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తగ్గుతాయి. * బీట్‌రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరుపు, మృదుత్వం పెరుగుతుంది.
News February 7, 2026
రేపు భాను సప్తమి.. ఏం చేయాలంటే?

ఆదివారం సప్తమి తిథితో వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఈ పండగ రోజు చేసే కొన్ని పనులు మనకు మంచి చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దానధర్మాలు చేస్తే మంచిది. వీటివల్ల దరిద్రం తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పూర్తి వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News February 7, 2026
‘వాట్సాప్ మీ సేవ’లో 581 సేవలు

TG: ‘వాట్సాప్ మీ సేవ’లో ఇప్పటివరకు 4.5L మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25L మంది డిజిటల్ సేవలు అందుకున్నారని తెలిపింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి 581 రకాల సేవలు పొందవచ్చని పేర్కొంది. బర్త్, డెత్, ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, లైసెన్సులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితరాలను పొందవచ్చంది.


