News August 22, 2025
FLASH: శామీర్‌పేట్ చెరువులో యువకుడి మృతదేహం కలకలం

శామీర్‌పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. మృతుడు చెరుకూరి రసూల్(25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నట్లు చెప్పారు.
Similar News
News January 24, 2026
నిజాంసాగర్: నవోదయలో ‘పరీక్ష పే చర్చ’ క్విజ్ పోటీలు

PM మోదీ పిలుపునిచ్చిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ జవహర్ నవోదయలో శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్విజ్ పోటీల్లో JNV ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, TG మోడల్ స్కూల్ ద్వితీయ స్థానంలో, KGVB నిజాంసాగర్ తృతీయ స్థానంలో నిలిచింది.
News January 24, 2026
ఏలూరు: GOOD NEWS .. ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఉచిత
ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణపై ఆసక్తి గల వారు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 08812-234146 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
News January 24, 2026
ఏలూరులో జాతర.. ట్రాఫిక్ మళ్లింపు

ఏలూరులో జాతర సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. భీమవరం, కైకలూరు వైపు వెళ్లే వాహనాలు బస్టాండ్ రోడ్డు, కోడెలు వంతెన, చాటపర్రు మీదుగా వెళ్లాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రేమాలయం, వెంకన్న చెరువు, పాత జూట్ మిల్, పంపుల చెరువు వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.


