News May 15, 2024

FLASH: హైదరాబాద్‌లో మరో మర్డర్

image

పాతబస్తీలో అర్ధరాత్రి జరిగిన మర్డర్‌ను మరవక ముందే మరో దారుణం జరిగింది. బోరబండ PS పరిధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కార్మికనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న మైదానంలో రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

image

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్‌లైన్‌లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.

News December 10, 2025

HYD: CM సాబ్.. జర దేఖోనా!

image

నేడు CM రేవంత్‌ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్‌ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.