News May 18, 2024
స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లోనూ ఫ్లాట్‌గానే!
ఈరోజు స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. తొలి సెషన్ (9.15-10 AM) ముగిసే నాటికి సెన్సెక్స్ 42 పాయింట్ల స్వల్ప లాభంతో 73,959కు చేరింది. నిఫ్టీ 22,481 వద్ద కొనసాగుతోంది. డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి ఉ.11.30 నుంచి మ.12.30 గంటల మధ్య రెండో సెషన్ ట్రేడింగ్ జరగనుంది. డిజాస్టర్ సైట్ పనితీరును పరీక్షించేందుకు ఈ స్పెషల్ ట్రేడింగ్ నిర్వహిస్తూ ఉంటారు.
Similar News
News December 11, 2024
విజయవాడకు వెళ్లిన కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు
కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు శ్రీధర్ చెరుకూరి, శ్రీధర్ చామకూరి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
News December 11, 2024
‘రైతుభరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?
TG: రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ICICI బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి RBIకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాలకు ఖర్చు చేయనుంది.
News December 11, 2024
మోహన్‌బాబుపై కేసు నమోదు
TG: మీడియా ప్రతినిధులపై <<14843588>>దాడి<<>> చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారు.