News March 31, 2024

విమానం ఒక రోజు ఆలస్యం.. ఎయిర్ ఇండియాకు రూ.85,000 ఫైన్

image

విమాన ఆలస్యంపై ఓ ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుపై ముంబై వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అతనికి రూ.85,000 పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాకు స్పష్టం చేసింది. 2018లో బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరాల్సిన విమానం ఒక రోజు ఆలస్యమైంది. సంస్థ నిర్లక్ష్యానికి తాను మానసిక వేదనకు గురయ్యానని, ఒక వర్క్ డే‌ను కోల్పోయానని మోహిత్ నిగమ్(33) ఫిర్యాదు చేశారు. సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

Similar News

News February 12, 2026

తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.

News February 12, 2026

సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల డ్యూటీనా: YCP ప్రశ్న

image

AP: NTR జిల్లా జగ్గయ్యపేటలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా సచివాలయ ఉద్యోగులను టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని డ్యూటీలు వేయడం ఏంటని YCP ప్రశ్నించింది. ‘సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరి చేసే బానిసలు అనుకుంటున్నారా? అక్కడ ఏటా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరమే కొత్తగా జరగడం లేదు. ఆదివారం, సెలవు రోజుల్లో ఉద్యోగులకు పని చెప్పడం దారుణం’ అని ట్వీట్ చేసింది.

News February 12, 2026

హెన్నాతో ఎన్నో లాభాలు

image

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.