News May 14, 2024

ఇండోనేషియాలో వరదలు.. 50 మంది మృతి

image

ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో సంభవించిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.

Similar News

News December 15, 2025

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేడు బాధ్యతలు చేపట్టనున్న నితిన్

image

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నితిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ నుంచి నియమితులైన తొలి వ్యక్తిగా, పిన్న వయస్కుడిగానూ ఆయన నిలిచారు. త్వరలోనే నితిన్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది.

News December 15, 2025

ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాల వలస

image

AP: రాష్ట్రంలో ఆరేళ్లలో 12.59 లక్షల కుటుంబాలు వలస వెళ్లినట్లు సచివాలయాల సర్వేలో వెల్లడైంది. వారంతా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పనులు చేసుకుంటున్నట్లు తేలింది. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలుండగా అత్యధికంగా విశాఖ(D)లో 1.13 లక్షలు, నెల్లూరులో 85వేల ఫ్యామిలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

News December 15, 2025

పీరియడ్స్ నొప్పికి కారణాలు

image

పీరియడ్స్‌ నొప్పి‌కి హై-లెవెల్ ప్రోస్టాగ్లాండిన్స్, యుటెరస్ వంటి కణజాలం గర్భాశయం వెలుపల పెరగడం, గర్భాశయంలో నాన్-క్యాన్సర్ ఫైబ్రాయిడ్ల పెరుగుదల, అడెనోమైయోసిస్, అంటే యుటెరస్ లైనింగ్ కండరాల గోడపై దాడి చేసి నొప్పికి దారితీస్తుంది. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ఫెక్షన్లు పీరియడ్స్ నొప్పిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.