News June 18, 2024
ఆహార ద్రవ్యోల్బణమే దెబ్బకొడుతోంది: RBI గవర్నర్

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నా ఆహార ధరలు పెరుగుతుండటంతో అది సవాల్‌గా మారుతోందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సప్లైకు కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం ధరలపై కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ద్రవ్యోల్బణ కట్టడి సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. గత ఏడు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం సగటు 8%గా ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 4.75%గా ఉంది.
Similar News
News January 15, 2026
ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.
News January 15, 2026
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<


