News May 13, 2024
‘370’ రద్దు తర్వాత శ్రీనగర్‌లో తొలిసారిగా..!

జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో ఈ నెల 25న లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అగా రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి వహీద్ ఉర్ రెహమాన్‌కు మధ్య మాత్రమే పోటీ నెలకొంది. స్థానికులు 3 దశాబ్దాల్లో తొలిసారిగా హింసాత్మక బెదిరింపులకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటం విశేషం.
Similar News
News December 7, 2025
అమలాపురం: డీసీసీ పగ్గాల కోసం 14 మంది పోటీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా వారధిగా నిలిచే ఈ కీలక పదవి కోసం ఏకంగా 14 మంది సీనియర్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్తూరు శ్రీనివాస్, వంటెద్దు వెంకన్ననాయుడు, ముషిణి రామకృష్ణారావు సహా పలువురు హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ పేర్లపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తోందని సమాచారం.
News December 7, 2025
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్‌లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్‌తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.


