News April 25, 2024
ఒకే బైకుపై నలుగురు.. ప్రమాదంలో అందరూ మృతి

TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో విషాదం జరిగింది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మరణించారు. ఇంటర్ ఫలితాల్లో పాస్ కావడంతో పొన్నం గణేశ్.. తన ముగ్గురు స్నేహితులైన వరుణ్ తేజ్, పొన్నాల రనిల్, సిద్ధులకు సాయంత్రం పార్టీ ఇచ్చాడు. అనంతరం ఒకే బైకుపై నలుగురు ఇంటికి వెళ్తుండగా ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి, ప్రాణాలు వదిలారు.
Similar News
News April 19, 2026
పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

AP Dy.CM పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.
News April 19, 2026
IPLలో నేడు హోరాహోరీ పోరు

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News April 19, 2026
భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.


