News August 11, 2025
ఫ్రీ బస్సు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(స్త్రీ శక్తి పథకం) ఈ నెల 15నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు మహిళా కండక్టర్లు ధరించే దుస్తులకు కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది.
Similar News
News March 15, 2026
రేపటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’

AP: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 16 నుంచి 10 రోజుల పాటు ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిటెక్, డీప్‌టెక్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్‌లో సాగు విధానాలపై అవగాహన కల్పిస్తారు. ప్రకృతి వ్యవసాయం, ఎల్‌నినో నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. ఈ నెల 25న జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
News March 15, 2026
నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.
News March 15, 2026
అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


