News August 2, 2024

FREE BUS ఎఫెక్ట్.. RTC కీలక నిర్ణయం

image

TG: మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. దీంతో డబ్బు చెల్లించి టికెట్లు కొనేవారు సీటు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై త్వరలో 300 సెమీడీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని TGSRTC నిర్ణయించింది. వీటిలో ఎక్స్‌ప్రెస్ కంటే 5-6% ఎక్కువ, డీలక్స్ కంటే 4% తక్కువగా ధరలు ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే సీట్లూ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో మహిళలకు ఉచితం కాదు.

Similar News

News December 14, 2025

ఈమె ఎంతో మందికి స్ఫూర్తి

image

TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి ఓటర్లలో చైతన్యం నింపారు. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా ఎంతోమంది ఓటేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రామాయంపేట పరిధి కల్వకుంటలో అంగవైకల్యమున్నా ఆమె పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. తండ్రి ఆమెను భుజాలపై మోసుకుని తీసుకెళ్లి ఓటు వేయించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

News December 14, 2025

54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

image

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బీటెక్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2025 స్కోరు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,100-రూ.1,77,500 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్‌సైట్: https://www.dvc.gov.in

News December 14, 2025

వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.