News September 10, 2025
తమలపాకుతో మోముకు తాజాదనం

అందంగా కనిపించేందుకు అమ్మాయిలు రసాయన ఉత్పత్తులు వాడటం కంటే సహజసిద్ధంగా దొరికే తమలపాకు వాడటం మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. తమలపాకును మెత్తగా నూరి పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది. తమలపాకులు మరిగించిన నీటిలో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే తాజాగా కనిపిస్తుంది. స్నానం చేసే నీటిలో తమలపాకు నూనె వేసుకొని చేస్తే చెమటవాసన తగ్గుతుంది.
Similar News
News December 17, 2025
30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.
News December 17, 2025
పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.
News December 17, 2025
మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

మెస్సీ టూర్‌తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.


