News March 28, 2024

కారు నుంచి హస్తానికి కేకే?

image

బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు(కేకే) కారు దిగి ‘చేయి’ అందుకునే అవకాశాలున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరడంపై యోచిస్తున్నానని కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే వెల్లడించారు. ఆమెతోపాటు కేకే కూడా వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. 2రోజుల క్రితం కేసీఆర్ ఫోన్ చేసి మరీ రావాలని పిలిచినా కేకే వెళ్లలేదని తెలుస్తోంది.

Similar News

News February 13, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News February 13, 2026

‘వారణాసి’ జానర్‌పై క్లారిటీ

image

వారణాసి సినిమా జానర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కాదని.. మైథలాజికల్ ఫాంటసీ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రన్‌టైమ్ 3 గంటలకు కాస్త తక్కువ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని.. మిగిలిన దాన్ని జూన్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్‌పై ఫోకస్ పెడతామని పేర్కొన్నారు.

News February 13, 2026

పిచ్చి తుగ్లక్‌లు చాలా మంది ఉంటారు: KTR

image

TG: <<19122392>>నేనే రాజు నేనే మంత్రి<<>> అనుకున్న చాలా మంది గాలికి కొట్టుకుపోయారని, ఎవరూ శాశ్వతం కాదని KTR విమర్శించారు. పిచ్చి తుగ్లక్‌లు చాలామంది ఉంటారని ఎద్దేవా చేశారు. ‘ఇందిర, NTR, KCR లాంటి నాయకులే ఓడిపోయారు. రేవంత్ రెడ్డిలా విర్రవీగిన వాళ్లు వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యం అలానే ఉంది’ అని తెలిపారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని CPIతో కలిసి గెలుచుకున్నామని, కొత్తగూడెంలో ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు.