News March 28, 2024
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఓ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Similar News
News February 13, 2026
బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.
News February 13, 2026
భగ్గుమంటున్న ధరలు

దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. JANలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా TGలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో AP ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.
News February 13, 2026
ఓట్ల లెక్కింపు ప్రారంభం

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలు, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.


