News March 28, 2024
జర్మనీ తగ్గింది.. అమెరికా తగ్గనంటోంది!

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌ను పారదర్శకంగా విచారిస్తారని ఆశిస్తున్నామంటూ జర్మనీ, అమెరికాలు కామెంట్ చేసి కేంద్రం నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలను పిలిచి కేంద్రం నిలదీసింది. దీంతో జర్మనీ వెనక్కి తగ్గింది. భారత రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని పేర్కొంది. అయితే US మాత్రం గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఈ కేసు విచారణను సమగ్రంగా పరిశీలిస్తామని మరోసారి కామెంట్ చేసింది.
Similar News
News February 16, 2026
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పుట్టపర్తి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత మండల, డివిజన్, మున్సిపాలిటీల్లో అధికారులకు సమర్పించవచ్చని అన్నారు. అక్కడ పరిష్కారం కానీ సమస్యలు జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించవచ్చని జిల్లా అధికారులందరూ పాల్గొంటారని వివరించారు.
News February 16, 2026
నేడు మచిలీపట్నంలో మీ కోసం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.
News February 16, 2026
రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు: అమిత్ షా

USతో ట్రేడ్ డీల్‌తో కేంద్రం రైతులకు <<19151159>>ద్రోహం చేస్తోందని<<>> రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.


