News June 20, 2024
జర్మనీ ఖాతాలో రెండో విజయం
యూరో ఛాంపియన్‌షిప్ 2024లో గ్రూప్-ఏలోని అతిథ్య జర్మనీ జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హంగేరీతో జరిగిన మ్యాచులో 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరో వైపు ఇదే గ్రూప్‌లోని స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అంతకుముందు క్రొయేషియా, అల్బేనియా మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగానే ముగిసింది. దీంతో క్రొయేషియా గ్రూప్-బీలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
Similar News
News September 17, 2024
ఈ ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్: మంత్రి ఉత్తమ్
TG: సన్న వడ్లకు క్వింటాపై ₹500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని చెప్పారు. వరి సాధారణ రకానికి ₹2,300, ఏ-గ్రేడుకు ₹2,320 మద్దతు ధర ఉండగా, ₹500 బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుంది. దొడ్డు రకానికీ బోనస్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
News September 17, 2024
త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ: మాజీ ఎంపీ GV
AP: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ GV హర్షకుమార్ ప్రకటించారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.
News September 17, 2024
ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్!
TG: ఒకరిపై మరొకరు నిత్యం తీవ్ర విమర్శలు చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్‌కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.