News March 23, 2024
కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ప్రకటన.. మండిపడ్డ కేంద్రం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పారదర్శక విచారణ చేపట్టాలన్న జర్మన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ.. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని నిలదీసింది. దోషిగా తేలే వరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించాలనేది చట్టంలోని ప్రాథమిక అంశమని, కేజ్రీవాల్‌కూ ఇది వర్తిస్తుందని జర్మనీ పేర్కొనడం దుమారం రేపింది.
Similar News
News December 17, 2025
మూడోదశ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

కరీంనగర్ జిల్లాలో మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల్లోని పోలింగ్, లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, CCటీవీ పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.
News December 17, 2025
పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.
News December 17, 2025
మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

మెస్సీ టూర్‌తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.


