News March 31, 2024
ఇప్పుడే పెళ్లి చేసుకో.. లేదంటే ఎన్నికల తర్వాత జైలుకే: అస్సాం సీఎం

తనకు 74 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకునేంత సత్తా ఉందని దుబ్రి ఎంపీ, AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై సీఎం హిమంత సెటైర్లు వేశారు. ‘ఆయన కావాలనుకుంటే ఇప్పుడే మరో పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఎన్నికల తర్వాత జైలుకు వెళ్లాల్సి వస్తుంది. త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను రాష్ట్రంలో అమలు చేస్తాం. అప్పుడు బహుభార్యత్వం చట్టవిరుద్ధం అవుతుంది’ అని తెలిపారు.
Similar News
News February 13, 2026
JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 13, 2026
అదృష్టం వరించింది.. టాస్‌తో గెలిచారు

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
News February 13, 2026
పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.


