News March 7, 2025
GET READY: నేడు ఉదయం 11 గంటలకు..

ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది. హైదరాబాద్‌లో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 6, 2025
ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని<
News December 6, 2025
నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్‌కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్‌కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.
News December 6, 2025
హిందీలో ‘పెద్ది’కి గట్టి పోటీ

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2026 మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకి హిందీలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మార్చి 19న యశ్ ‘టాక్సిక్’తో పాటు అజయ్ దేవ్‌గణ్ ‘ధమాల్ 4’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటికి హిట్ టాక్ వస్తే ‘పెద్ది’ ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.


