News November 19, 2025

GHMC ఎన్నికలకు సిద్ధం కావాలి: KTR

image

ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, GHMC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు. బుధవారం HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.

Similar News

News January 14, 2026

అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

image

అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకే అగ్రతాంబూలం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలనిన్నారు

News January 14, 2026

BJPలోకి హరీశ్ అని ప్రచారం.. ఖండించిన BRS

image

TG: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే హరీశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారని ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ కమలం గూటికి వెళ్లబోతున్నారని అందులో ఉంది.

News January 13, 2026

పవన్ కళ్యాణ్‌కు మోదీ అభినందన

image

AP: జపనీస్ <<18828407>>కత్తిసాము<<>> కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను PM మోదీ ప్రశంసించారు. ‘ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్‌లో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఫిట్ ఇండియాకు ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.