News October 7, 2025
GHMC వ్యాప్తంగా BT ప్యాచ్ వర్క్ పనులు షురూ

గ్రేటర్ HYD వ్యాప్తంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల మేరకు BT ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. సీసీ, బీటీ రోడ్లపై ఉన్న గుంతలను బిటుమిన్ ఉపయోగించి ఎక్కడికికక్కడ పూడ్చి వేస్తున్నామని చెప్పారు. మీ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఉంటే మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News January 23, 2026
బాపట్ల జిల్లా మీదుగా దూసుకెళ్తుంది.!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు బాపట్ల మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
News January 23, 2026
నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు కేటాయించేందుకు CRDA ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇ-లాటరీ ద్వారా అందజేయనుంది. మొత్తం 15 గ్రామాల్లోని 291 మందికి స్థలాలు ఇవ్వనుంది. 14 గ్రామాల రైతులకు 11AMకు, ఉండవల్లిలో మెట్టభూములిచ్చిన వారికి 3PMకు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చిన, ఉండవల్లిలో జరీబు భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు ఇవ్వనుంది.
News January 23, 2026
విజయవాడ: ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని మోసం

మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రీస్తురాజుపురానికి చెందిన చెందిన ఓ బాలిక(15)ను అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు వసంత్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ వెంకటరమణ గురువారం తెలిపారు.


