News November 1, 2025

GNSS కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

image

GNSS స్పెషల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన నీలమయ్య రిలీవ్ అయ్యాడు. ఆ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌ను అదనంగా స్పెషల్ కలెక్టర్‌గా కేటాయించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్‌లో కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు.

Similar News

News November 2, 2025

సిద్దిపేట: వైన్స్ షాపుల అనధికారిక వేలం!

image

రెండు రోజుల క్రితం మద్యం దుకాణాల టెండర్లు పూర్తయ్యాయి. దుకాణాలు పొందిన వారికి అదృష్టం వరించిందని అందరు అనుకున్నారు. నిజమే వారికి అదృష్టం వరించింది. అధికారిక టెండర్లు పూర్తవ్వగానే ఇప్పడు అనధికారంగా వేలం పాటలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారు ఆ దుకాణాలను కోట్లలో విక్రయించడానికి తెర తీశారని అంటున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూద్దాం.

News November 2, 2025

అమరావతి మార్క్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక

image

నవంబర్ 26న రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించనున్న మార్క్ అసెంబ్లీకి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పోటీల్లో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారని MEOలు త్యాగరాజు, నాగ సుబ్రాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ తెలిపారు. PTM మండలం, రంగసముద్రం ZP స్కూల్ విద్యార్థి పవన్ సాయి, తంబళ్లపల్లె మోడల్ స్కూల్ విద్యార్థిని సుహాన, బి కొత్తకోట ZP విద్యార్థి అనిల్ కుమార్ ఎంపికయ్యారన్నారు.

News November 2, 2025

ప్రొద్దుటూరు: అక్టోబర్‌లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

image

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.