News October 8, 2025
GNT: అట్లతద్ది..ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయా.!

హిందూ సాంప్రదాయాల్లో అట్లతద్దికి ఎంతో విశిష్టత ఉంది. అచ్చు తెలుగు అమ్మాయిల పండుగ ఇది. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈ పండుగతో చాలా మందికి అనేక జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. తెల్లవారు జామునే స్నానం చేసి అరిటాకులో భోజనం చేయడం, దోసెలు తినడం ఆ తర్వాత వీధిలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఊగుతూ కేరింతలు కొట్టడం ఈ పండుగ ప్రత్యేకతలు. చిన్నప్పుడు మీకూ ఈ అనుభవాలు ఉన్నాయా..? కామెంట్ చేయండి.
Similar News
News January 21, 2026
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News January 21, 2026
గ్రహపీడ విముక్తి కోసం శనివారం గిరి ప్రదక్షిణ

గిరి ప్రదక్షిణను శనివారం చేస్తే గ్రహ పీడల నుంచి విముక్తి కలుగుతుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచిస్తున్నారు. జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగి జీవితం సుగమమవుతుందని అంటున్నారు. గిరి రూపంలో ఉన్న శివుడు భక్తుల కష్టాలను తొలగించి, రక్షణ కవచంలా నిలుస్తాడని, ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తిని, గ్రహగతులను అనుకూలంగా మార్చుకునే బలాన్ని ప్రసాదిస్తుందని వివరిస్తున్నారు.
News January 21, 2026
రాష్ట్రంలోనే పెద్దమండ్యం రికార్డు

విద్యా శాఖ నిర్వహించిన “స్పెల్లింగ్ B” పోటీల్లో పెద్దమండ్యం చిన్నారులు సత్తా చాటారు. వెలిగల్లు ప్రాథమిక పాఠశాల నుంచి జోనల్ స్థాయి స్క్రీనింగ్ టెస్టులకు 20 మంది విద్యార్థులు ఎంపికై రికార్డు సృష్టించినట్లు MEOలు మనోహర్, రామకృష్ణ చెప్పారు. ఇంగ్లీష్ టీచర్ మధుకర్ రెడ్డి SPEL-Bలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. కడపలో ఈనెల 22న జరిగే జోనల్ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని MEOలు చెప్పారు.


