News August 22, 2025
GNT: ఆ రోజులు మీకు గుర్తున్నాయా?

చిన్ననాటి వినాయక చవితి వేడుకలు మధుర జ్ఞాపకాలు.10 రోజుల ముందు నుంచే హడావిడి ఉండేది. వీధుల్లో పెద్ద పందిళ్లు మైకుల్లో పాటల హోరు.. ఆ సందడే వేరు. ఉదయం పూజలు, రాత్రికి స్నేహితులతో కలిసి తిరుగుతూ రకరకాల బొమ్మలు చూస్తూ, ప్రసాదాలను ఆస్వాదిస్తూ, ఆడిపాడిన ఆ రోజులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అనుభూతులు ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాయి. ఆ పాత రోజులలో జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా? COMMENT చేయండి.
Similar News
News January 20, 2026
MHBD: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి: జడ్పీ సీఈఓ

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్పంచులు గ్రామాల్లో సుపరిపాలన అందించాలని జడ్పీ సీఈఓ పురుషోత్తం పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం రెండో రోజు నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టం, విధులపై అవగాహన పెంచుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డీపీఓ హరిప్రసాద్, డీఎల్పీఓ పుల్లారావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ఉన్నారు.
News January 20, 2026
వీధికుక్కల కేసు.. మేనకా గాంధీపై సుప్రీం ఫైర్

వీధికుక్కల అంశంపై తమ కామెంట్స్‌ను కించపరచడం కోర్టు ధిక్కరణేనని BJP నేత మేనకా గాంధీపై SC మండిపడింది. ‘మీరు మా వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారు. మీ క్లయింట్ ఎలాంటి కామెంట్స్ చేశారో అడిగారా? ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించారా?’ అని మేనకా తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీంతో తాను గతంలో కసబ్ తరఫునా వాదించానని ఆయన గుర్తుచేశారు. కానీ కసబ్ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదంటూ తదుపరి విచారణను JAN 28కి వాయిదా వేసింది.
News January 20, 2026
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.


