News August 21, 2025
GNT: ఐటీఐ సీట్ల భర్తీకి మూడవ విడత అవకాశం

గుంటూరు జిల్లాలో ఐటీఐలో చేరదలచిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. ఖాళీగా ఉన్న సీట్లను పూరించేందుకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరైతేనే సీటు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News January 23, 2026
ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చర్యలు: గొట్టిపాటి

రాబోయే మూడేళ్లలో యూనిట్ ఛార్జీలో రూ.1.19 వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు. నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరలకు అందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
News January 23, 2026
RTC బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

ప్రభుత్వ సేవల పై పాజిటివ్ పర్సెప్షన్ మరింతగా మెరుగుపర్చేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో శుక్రవారం ప్రజారవాణా, రిజిస్ట్రేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీబస్టాండ్‌లో తాగునీరు, పరిశుభ్రత, సీటింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
News January 23, 2026
నేటి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 38,000 బస్తాల సరుకు వచ్చింది. ఇందులో 28,000 బస్తాలు కొత్త పంట కాగా, 10,000 బస్తాలు ఏసీ నిల్వలు ఉన్నాయి. తేజా రకం ధర స్వల్పంగా తగ్గింది. గరిష్టంగా రూ.18,300 పలికినప్పటికీ, సగటున రూ.18,000 వద్దే లావాదేవీలు జరిగాయి. 341, డీడీ రకాలు రూ.24,000 నుండి రూ.24,500 వరకు అమ్ముడుపోయాయి. బ్యాడిగి ఏసీ రకం గరిష్టంగా రూ.30,000 వరకు పలికింది. ఆర్మూర్ రకం రూ.16,500 వద్ద నిలిచింది.


