News October 5, 2025
GNT: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

నిరుద్యోగ యువతకు స్కిల్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెనాలిలోని NAC, APSSDC ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుంది. నిరుద్యోగ యువతకు సహాయ సర్వేయర్ కోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించనున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. ఆసక్తి ఉన్నవారు OCT 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు తెనాలిలోని DSL కార్యాలయం సమీపంలో ఉన్న NACలో సంప్రదించాలన్నారు.
Similar News
News January 21, 2026
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.
News January 21, 2026
పట్టాదారు పాసు పుస్తకాల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

పరిగి మండలంలో జరుగుతున్న డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల పరిశీలనను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. రీ సర్వే పూర్తయిన హుస్సేన్ బి అనే మహిళకు ఈ-కేవైసీ పూర్తి చేసి డ్రాఫ్ట్ పట్టా ప్రతిని ఆమెకు అందజేశారు. పాస్ పుస్తకాల జారీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని, ధ్రువీకరణ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News January 21, 2026
జగిత్యాల: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు: మంత్రి సీతక్క

జగిత్యాల జిల్లాలో నూకపల్లి న్యాక్ సెంటర్‌లో నూతన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, సుపరిపాలనతో వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్పంచులు ప్రజల అవసరాలను గుర్తించి, కేంద్ర, రాష్ట్ర నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని పిలుపునిచ్చారు. పారదర్శకమైన పాలనతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.


