News December 1, 2025
GNT: నూతన HIV చికిత్స.. బిడ్డకు సోకే ప్రమాదం తగ్గింపు.!

సెప్టెంబర్, 2012 నుంచి జిల్లాలో HIV సోకిన ప్రతి గర్బిణికి 14వ వారము నుంచి నూతన చికిత్స విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తద్వారా బిడ్డకు HIV వచ్చే అవకాశం తగ్గుతుంది. అటు ఈ సంవత్సరం గుంటూరు, తెనాలిలోని సుఖవ్యాధి చికిత్సా కేంద్రాల నుంచి 4,785 మంది సుఖవ్యాధులు సోకినవారు చికిత్స పొందారు. జిల్లాలో షిప్ పాజిటివ్, హ్యాపెన్ సంస్థ, లయన్స్ క్లబ్, ల్యాంప్, రాజీవ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.
Similar News
News February 10, 2026
అమరావతి అనుసంధానంగా నాలుగు వరుసల ROB

రాజధాని అమరావతి అనుసంధానంగా మంగళగిరి పట్టణంలో నిడమర్రు రైల్వే గేట్ వద్ద నాలుగు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.90.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును18 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రద్దీ తగ్గించి, అమరావతి ప్రాంతానికి వేగవంతమైన రాకపోకలకు ఇది దోహదం చేయనుంది.
News February 10, 2026
GNT: మందగించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

ప్రభుత్వ పథకాల లక్ష్యంతో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మందగించింది. గుంటూరులో 52.2%, బాపట్లలో 53.4%, పల్నాడులో 36.9 శాతం నమోదు పూర్తైంది. ప్రశ్నావళిలో అడిగే వివరాలకు ప్రజలు సమాధానాలు ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారు. ఆధారాలు చూపేందుకు నిరాకరిస్తున్నారు. సిబ్బంది ఇళ్లకు వెళ్లినా చాలామంది నివాసం లేనివారిగా తేలుతున్నారు. దీంతో లక్షల్లో పౌరుల చిరునామాలు లభించని పరిస్థితి.
News February 10, 2026
GNT: శైవక్షేత్రాలకు అదనపు ఆర్టీసీ బస్సులు

శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం RTC విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. గుంటూరు–1, గుంటూరు–2తో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచే శ్రీశైలానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. కోటప్పకొండకు గుంటూరు నుంచి 90, క్వారీ 38, గోవాడకు 34 బస్సులు ఏర్పాటు చేశారు.


